Homebreaking updates newsనలభైల్లోకి వచ్చినా.. ఏ మాత్రం అందం తగ్గలే

నలభైల్లోకి వచ్చినా.. ఏ మాత్రం అందం తగ్గలే

భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఒకప్పుడు హీరోయిన్లు రెండు, మూడు దశాబ్దాల పాటు వెండితెరపై నాయికగా రాణించేవారు. వారికి సినీ ఇండ్రస్టీలో అలాంటి అవకాశాలు కూడా లభించేవి. ఇందుకు శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు పక్కన చిందులు వేసిన శ్రీదేవి, నాగార్జునకు జోడిగా కూడా నటించింది. సీనియర్ ఎన్టీఆర్ మనవరాలిగా నటించి తిరిగి అదే హీరోతో కథానాయికగా మెప్పించిన ఏకైక హీరోయిన్ గా నిలిచింది అతిలోక సుందరి శ్రీదేవి. చిరంజీవికి హీరోయిన్ గా నటించిన జయసుధ.. పలు సినిమాల్లో తల్లిగా నటించి మెప్పించింది. జయప్రద కూడా ఎన్టీఆర్ లాంటి మహామహులతో నటించి కుర్ర హీరోలతో సైతం జట్టు కట్టింది.

అయితే ప్రస్తుత ట్రెండ్ ప్రకారం నేటి హీరోయిన్లకు ఎక్కువ కాలం వెండితెరపై నటించే అవకాశం సినిమా ఇండస్ట్రీ కల్పించట్లేదు. ఇప్పుడన్నీ హీరోయిజం ఎలివేషన్ తో కమర్షియల్ మూవీస్ కావడంతో సినిమాకో సుందరాంగిని సినిమాల్లో పెట్టుకుంటున్నారు. ఓ హీరోయిన్ పది సినిమాలు చేస్తే మహా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు. కానీ ఈ ట్రెండ్ లో కూడా కొందరు హీరోయిన్లు మాత్రం నలభైల్లో పడినా గ్లామర్ ఒలకబోస్తూనే ఉన్నారు. ఇటు లేడీ ఓరియెంటేడ్ తో పాటు స్టార్ హీరోల పక్కన అందాలు ఆరబోస్తున్నారు. అవకశాలు దక్కించుకుంటున్నారు. ఈ వరుసలో ముందుగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. నయనతార, త్రిష, అనుష్క, కాజల్ వంటి పేర్లనే.

సౌత్ లో నయనతారకు ఉన్న క్రేజ్ మరే హీరోయిన్ కు లేదు. లేడీ సూపర్ స్టార్ గా సౌత్ సినిమాను శాసిస్తోంది. తాజాగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ తో కూడా జత కట్టి నార్త్ లో కూడా క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ప్రారంభంలో విపరీతంగా అందాలు పంచిన ఈ ముద్దుగుమ్మ తర్వాత లేడీ ఓరియెంటేడ్ చిత్రాలతో సూపర్ హిట్స్ సాధిస్తున్నది. మరో పదేళ్ల దాక నయన్ క్రేజ్ కు వన్నె తగ్గేలా లేదు అన్నది నేటి ఫిల్మ్ నగర్ టాక్. ఇక త్రిష.. అయితే అప్పట్లో వర్షంలో ఎలా ఉందో.. ఇప్పటికీ అదే గ్లామర్ మెయింటెన్ చేస్తున్నది. రామ్ చరణ్ సరసన నటించిన కాజల్.. చిరు, బాలయ్యతోనూ డ్యాన్సులు చేస్తున్నది. అనుష్క.. తనకంటే చాలా చిన్నవాడైన నవీన్ పొలిశెట్టితో రొమాన్స్ చేసి హౌరా అనిపించింది. నలభై ఏండ్లు వచ్చినా నవ నవలాడే అందాలతో ఈ తారామణులు అభిమానులను సమ్మోహనపరుస్తూనే ఉన్నారు. చూడాలి ఈ వీరి ట్రెండ్ ఎప్పటి వరకూ కొనసాగుతుందో, కథానాయికలుగా ఇంకెన్ని సినిమాల్లో మెప్పిస్తారో.

RELATED ARTICLES

Most Popular

Recent Comments