Homemain slides‘వీళ్లతో ఎప్పుడూ పెట్టుకోవద్దు’.. మహీంద్రా స్వీట్ వార్నింగ్

‘వీళ్లతో ఎప్పుడూ పెట్టుకోవద్దు’.. మహీంద్రా స్వీట్ వార్నింగ్

భారత్ సమాచార్, జాతీయం : భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ లో ఉంటారనేది తెలిసిందే. మహీంద్రా పోస్ట్ కోసం చాలా మంది ఎదురుచూస్తుంటారు. ఆయన పెట్టే పోస్ట్ లు, వీడియోలు ఎంతో ఆసక్తికరమైనవి, ఉత్తేజితం చెందించేవి, అలాగే దేశభక్తిని పెంచేవి, ఇలా.. ఆయన ప్రతీ పోస్ట్ ఏదో ఒక సందేశాన్ని ఇస్తుంటుంది.

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో శుక్రవారం జరిగిన పరేడ్ అద్యంతం ఆకట్టుకుంది. దీనిపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ మన అమేయ సైనిక శక్తిని కొనియాడారు. ఈ సందర్భంగా శత్రుదేశాలను ఉద్దేశిస్తూ, ఓ సున్నిత హెచ్చరిక కూడా చేశారు. పరేడ్ లో సైనిక కవాతు వీడియోను పోస్ట్ చేసిన ఆయన..‘‘ ఇతర దేశాల సైన్యానికి నాదో వ్యక్తిగత సలహా. వీళ్లతో ఎప్పుడూ పెట్టుకోవద్దు..’’ అని రాసుకొచ్చారు. మన సైన్యం శక్తి సామర్థ్యాలను ఉద్దేశిస్తూ ‘భారత్ దృఢంగా ఉంది’ అనే అర్థం వచ్చేలా ఎమోజీలు జత చేశారు’’. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈసారి జరిగిన గణతంత్ర వేడుకల పరేడ్ లో మన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిచెప్పారు. దేశీయంగా తయారుచేసిన ఆయుధాలతో పాటు నాగ్ క్షిపణులు, టీ-90 భీష్మ యుద్ధ ట్యాంకులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, పినాక మల్టీపుల్ రాకెట్ వ్యవస్థ, వెపన్ లొకేషన్ రాడార్ వ్యవస్థలు, బీఎంపీ-2 సాయుధ శకటాలను ప్రదర్శించారు. ఇక, తొలిసారిగా పూర్తి స్థాయిలో త్రివిధ దళాలకు చెందిన నారీమణులు చేసిన కవాతు, విన్యాసాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఆనంద్ మహీంద్రా ట్వీట్ తో ఆ వీడియోను నెటిజన్లు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.

మరికొన్ని ప్రత్యేక సంగతులు…

నరేంద్ర మోడీ‌@420 హామీలు

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments