భారత్ సమాచార్, ‘అక్షర’ప్రపంచం ;
అది 1980వ సంవత్సరం…
కారంచేడు గ్రామం…
మండుతున్న వేసవికాలంలో ఒక ఆడపులి ఆకలితో ఎదురుచూస్తున్న రోజున…
సీత ఇంటి దగ్గర మంచి ఘూటైనా బిర్యాని చేయటానికి పెద్ద పెద్ద మటన్ ముక్కలు నరుకుతున్నాడు జిలాని . సీత, హడావిడిగా పెరట్లో ఉన్న చెట్టుకు కరివేపాకు కోస్తోంది. పెరుగు పచ్చడిలో పైపైన చిన్న, చిన్న అల్లం తురుమును చల్లుతోంది. నిప్పుల కుంపటిపైన వస్తోన్న బిర్యానీ పొగలు చూస్తూ అక్కడే ఒక కుక్క కూర్చొని ఉంది. రెండు వేట ముక్కలు అయినా…



