భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;

దుర్గాదేవి తొమ్మిది అవతారాల గురించిన ప్రత్యేక కథనం…

1. శైలపుత్రి

ఉత్తరప్రదేశ్ లో వారణాసిలో శైలపుత్రి ఆలయం ఉంది. నవదుర్గలలో దుర్గాదేవి మొదటి అవతారం శైలపుత్రి అని చెబుతారు. దుర్గామాత, శైల రజగు హిమవంతుని కుమార్తెగా జన్మించినది. ఈ అమ్మవారు వృషభ వాహనం పైన ఉండి కుడి చేత త్రిశూలం, ఎడమ చేత పద్మం ధరించి ఉంటుంది. శరన్నవరాత్రులలో ఈ దేవిని ఉత్సవ మూర్తిగా అలంకరించి తొలినాడైన పాడ్యమి నాడు పూజించి, ఉపవాస దీక్షలు చేసి భక్తులు తరిస్తారు.