భారత్ సమాచార్, నల్గొండ: నల్గొండ పట్టణ శివారులోని బైపాస్ రోడ్డులో సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బైకిస్ట్ మృతి చెందాడు. మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావుగా పోలీసులు గుర్తించారు. నటుడు రఘుబాబు కారు ప్రమాదవశాత్తూ ఓ బైక్‌ని ఢీకొట్టింది. నటుడు రఘుబాబు కారు బైకును దాదాపు 50 మీటర్ల దూరం లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన నల్గొండ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత స్పాట్‌డెడ్: