భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాల సమాచారం క్షణాల్లో ప్రజలందరికీ తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన వలంటీర్ల వాట్సాప్, టెలిగ్రాం తదితర గ్రూపులన్నింటినీ తక్షణమే తొలగించాలంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివ ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమ ఆదేశాలు తక్షణం క్షేత్ర స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలె క్టర్లకు సూచించారు.
ఆయా వలంటీర్ల వాట్సాప్ గ్రూపుల తొలగించిన వివరాలను అధికారులు…



