భారత్ సమాచార్, అమరావతి ;
నిరుద్యోగులు వెయ్యి కళ్లతో ఐదేళ్లగా ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ ని నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన చర్యలు చేపడుతోంది. మెగా డీఎస్పీకి ముందు నిర్వహించే టెట్ పరీక్షకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను అభ్యర్థుల సూచన మేరకు సవరించింది. ఆగస్టు 3వ తేదీ వరకు టెట్ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 20 వరకు టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. నవంబర్ 2వ తేదీన టెట్…




