భారత్ సమాచార్, హైదరాబాద్ : మేడారం జాతర వస్తుందంటే చాలు తెలంగాణ అంతటా పండుగ వాతావరణం నెలకొంటుందన్న విషయం అందరికి తెలిసిందే. కోట్లాది భక్తులు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా సమ్మక్క, సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునేందుకు వెళ్తుంటారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా ఏపీ, ఛత్తీస్ గఢ్, ఒడిషా, మహారాష్ట్ర, కర్నాటక, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి గిరిజన భక్తులు, ఇతర భక్తులు తండోప తండాలుగా తరలివస్తుంటారు. జాతర జరిగే నాలుగు రోజుల్లో భక్తుల రద్దీ చాలా అధికంగా ఉంటుంది కాబట్టి కొందరు భక్తులు రెండు…