భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: పేద, మధ్యతరగతి కుటుంబాల సొంత ఇంటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి ఆవుల రాజిరెడ్డి స్పష్టం చేశారు. శివ్వంపేట మండలంలోని నవాబ్‌పేట, చిలప్‌చెడ్ మండలంలోని గౌతపూర్ గ్రామాల్లో శనివారం నిర్వహించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులకు శాలువాలు కప్పి, శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ…





