భారత్ సమాచార్, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని గాంధీభవన్ వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తున్న భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, ఇతర బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేయడాన్ని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భండారి శాంతికుమార్ తీవ్రంగా ఖండించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నివాసం వద్ద కాంగ్రెస్ నాయకులు అరాచకానికి పాల్పడి దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. ఆ చర్యలను ప్రశ్నిస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తున్న…





