భారత్ సమాచార్, జాతీయం : 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు మార్చి 11న దేశంలో రెండు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
1. మార్చి 12 లోగా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కోర్టుకి, ప్రజలకి అందించాలని ఎస్‌బీఐను సుప్రీంకోర్టు మార్చి11న ఆదేశించింది.
2. అదే రోజు సాయంత్రానికి 2019లో ఆమోదం పొందిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు సంబంధించిన నిబంధనలను నోటిఫై చేశామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.
పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మతపరమైన హింస కారణంగా భారతదేశానికి వలస వచ్చిన…



