భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సంబరాలపై బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత తీవ్ర విమర్శలు చేశారు. నెల్లికుదురు మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ మండల శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో విఫలమైన అంశాలను నిరసిస్తూ సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ తదితర సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల నుంచి బీఆర్‌ఎస్‌లో…