భారత్ సమాచార్, దిల్లీ ;
దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు రాష్ట్ర మంత్రుల బృందంతో కలిసి కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణ సమగ్రాభివృద్ధికి కీలకమైన రహదారుల విస్తరణలో రాష్ట్రానికి అవసరమైన చేయూతను అందించాలని మంత్రిని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లతో పాటు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కేంద్ర మంత్రితో సమావేశమయ్యారు.
- …





