భారత్ సమాచార్, హైదరాబాద్ ;
అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటనను విజయవంతంగా ముగించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. పది రోజుల పాటు సాగిన పర్యటన పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా విమానాశ్రయంలో ఆయనకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఇతర ఉన్నతస్థాయి అధికారుల బృందంతో సాగిన ఈ పర్యటన తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ప్రత్యక్షంగా, పరోక్షంగా యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు దోహదపడే…





