భారత్ సమాచార్, జాతీయం ;
సాధారణంగా మే నెల వస్తుందంటేనే భయంకరమైన ఎండలు, ఊపిరాడని ఉక్కపోత, వడగాలులు అని భయపడుతుంటాం. దీనికి భిన్నంగా ఈ ఏడాది చల్లని మే నెలని చూస్తున్నాం. గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులు కారణం ఏదైనా ఈ సమ్మర్ హాలిడేస్ లో మే నెల ఎండల నుంచి ప్రజలకు కొంచెం ఉపశమనం లభించిన మాటవాస్తవం. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో వచ్చే వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.…



