భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని, ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా అటవీశాఖ అధికారి విజయలక్ష్మి ఆదేశాల మేరకు అటవీ సిబ్బంది ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ వీధుల్లో సాగిన ఈ ప్రదర్శన ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలని మరియు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు ఆమె మొక్కలు…