భారత్ సమాచార్, అమరావతి ;

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి మధ్య ఎన్నికల సీట్ల పంపకాలపై ఎడతెరిపి లేని చర్చ జరిగిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం కూటమిలో
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల పంపకాలపై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టుల వివరాలను అందించాలని సాధారణ పరిపాలనశాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. వీటితోపాటు సొసైటీ, ప్రత్యేక బాడీల్లో ఉన్న పోస్టుల వివరాలు కూడా అందించాలని అందులో పేర్కొంది.…