భారత్ సమాచార్, హైదరాబాద్ ;
ప్రజాపాలనను మరింత వేగవంతం చేయటానికి హైదరాబాద్ లోని సచివాలయంలో జిల్లా కలెక్టర్లు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. “ప్రభుత్వానికి కళ్లు, చెవులు మీరే. ప్రతి అధికారి ఒక శంకరన్, ఒక శ్రీధరన్ లా సామాన్య ప్రజలకు ఎప్పుడూ గుర్తుండేలా పనిచేయాలి” అని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
▪️ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా మానవీయ కోణంలో ప్రజలకు సేవలు అందించాలని చెప్పారు. అధికారులు తీసుకునే ప్రతి చర్యా ఇది ప్రజా…





