భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: బక్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ముస్లిం సోదరులు ఎవరూ ఆవులను కొనవద్దని, కుర్బానీ ఇవ్వవద్దని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లిం సోదరులంతా ఆవులకు బదులుగా కేవలం మేకలు, గొర్రెలను మాత్రమే కుర్బానీగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతు సోదరులు తమ వద్దకు వచ్చి ఆవులను అమ్మజూపినా సున్నితంగా తిరస్కరించాలని స్పష్టం చేశారు.

మన హిందూ సోదరులు ఆవును గోమాతగా భావించి ఎంతో పవిత్రంగా పూజిస్తారని, వారి…