భారత్ సమాచార్, కోడుమూరు ; కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం గూడూరులో ఏర్పాటు చేసిన ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం రిజర్వేషన్లపై జగన్ విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని తీసేయం, సైకో ప్రచారాన్ని నమ్మెద్దని ప్రజలకు సూచించారు. టీడీపీ హయాంలో ముస్లింలు హజ్ యాత్రకు వెళ్ళేందుకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ వేయించామని గుర్తు చేశారు. మైనారిటీల విశ్వాసాలను గౌరవించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లిం మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ కాపాడే బాధ్యత తనదే అని చంద్రబాబు భరోసా ఇచ్చారు.
గూడూరులో జన ప్రభంజనం కనిపిస్తోందన్నారు. ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాబు కనిపిస్తోందని చెప్పారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. ఆలూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో వస్తున్న జన స్పందన చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి తిరుగు లేదనిపిస్తోందన్నారు. అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ టీడీపీ అని, జనాభా దామాషా ప్రకారమే టికెట్లు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. సైకో జగన్ మాటలు చెబుతూ మోసాలు చేసే వ్యక్తి అని విమర్శించారు. నేను చెప్పిందే చేస్తాను, ఒకవేళ ఏదైనా చేయలేనిదైతే ఆ విషయం కూడా హుందాగా ప్రజల ముందే చెబుతానన్నారు. నాది ఒకటే ఆలోచన, 40 ఏళ్లు నన్ను ఆదరించారు. నేను మళ్లీ మీ అందరినీ అన్ని విధాలా అభివృద్ధి చేసి ఏపీని దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు వచ్చానన్నారు. రాష్ట్రంలో తీవ్రంగా నష్టం జరగడం వల్లే కూటమి కట్టామని స్పష్టం చేశారు.
‘‘1995 నుంచి టీడీపీ ఎన్డీయేలో ఉంది. 2014 నుంచి 2019 వరకు ఎన్డీయేలో ఉంది. ఇక్కడుండే ముస్లిం సోదరులకు ఎవరికైనా అన్యాయం జరిగిందా? ఎప్పుడైనా అన్యాయం చేశామా? హైదరాబాదులో ముస్లిం యూనివర్సిటీ తెచ్చింది నేనే. అది కూడా వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో. ఆ తర్వాత హజ్ హౌస్ కట్టి హైదరాబాద్ నుంచి నేరుగా మక్కా పంపే ఏర్పాట్లు చేశాం. 13 జిల్లాల్లో ఉర్దూను రెండో భాషగా ప్రారంభించింది మేమే. విభజన జరిగిన తర్వాత దుకాన్ ఔర్ మకాన్ పథకం ఇచ్చాం. దుల్హన్ పథకం కింద 36 వేల మంది ముస్లిం ఆడబిడ్డలకు రూ.136 కోట్ల నిధులతో పెళ్లిళ్లు జరిపించాం. రంజాన్ తోఫా ఇచ్చాం, ఇమామ్ లు, మౌజన్ లకు పారితోషికం ఇచ్చాం. ముస్లింలకు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చాం, వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడాం. 2014లో ముస్లిం రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టులో ముస్లింల తరఫున న్యాయవాదులను ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం’’ అని చంద్రబాబు అన్నారు.
సుప్రీంకోర్టులో ముస్లింల కోసం ఎంతమంది న్యాయవాదులైనా పెట్టి రిజర్వేషన్లను రక్షించుకునే బాధ్యత కూటమి తరపున తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. ఇదే కాదు, మసీదులకు ఆర్థికసాయం చేసిన పార్టీ టీడీపీ నే అన్నారు. మసీదులపై దాడులు చేసిన పార్టీ వైసీపీ నేనని ఆరోపించారు.
మరికొన్ని రాజకీయ సంగతులు…
‘‘అధికారం ఉంటే మర్డర్లు, దోపిడీలు చేస్తారా?’’





