భారత్ సమాచార్, ఛత్తీస్ ఘడ్ ;

ఛత్తీస్‌గఢ్‌లోని కవర్ధ జిల్లా లో నేడు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 18 మంది ఆదివాసీలు మృతి చెందినట్లు నిర్దారించారు. తునికాకు సేకరణ కోసం వెళ్లిన ఆదివాసీలు ప్రయా ణిస్తున్న వ్యాను వాహనం అదుపు తప్పి 20 అడుగుల లోయలో పడింది. ప్రయాణ సమయంలో ఆ వాహనంలో 40 మంది వరకు ఉన్నారని స్థానికులు తెలిపారు. అందరూ తునికాకు సేకరణ ముగించుకొని తిరిగి సెమ్హార గ్రామం వస్తున్న సమయం లో ఈ ప్రమాదం సంభవించింది.…