భారత్ సమాచార్, అమరావతి ;
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్ ను సరఫరా చేయాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సకాలంలో విద్యుత్ బకాయిల నిధులు విడుదలవ్వక సర్కారీ బడులు, కళాశాలలు కరెంటు బిల్లులు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఇంధన శాఖ త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక పోర్టల్‌తో అనుసంధానం
సర్కారీ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర విద్యుత్…




