భారత్ సమాచార్, హైదరాబాద్ ; ఈ ఏడాది తెలుగు తెరపై ఎక్కువగా హార్రర్ కామెడీ జోనర్ కనిపించలేదు. సినీ ప్రేమికులకు ఆ లోటును పూడ్చటానికి ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ ముందుకొచ్చింది. 2014లో విడుదలైన ‘గీతాంజలి’ మూవీకి సీక్వెల్ ఇది. నటిగా కథానాయిక అంజలికి ఇది 50 వ చిత్రం. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ను హైదరాబాద్ వేదికగా జరిగిన ఈవెంట్ లో దర్శకనిర్మాతలు రిలీజ్ చేశారు. ప్రచారచిత్రం చాలా ప్రామిసింగ్ గా ఉంది. భయపెడుతూ నవ్విస్తున్న ట్రైలర్ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది.…