భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఉన్నారు. శాఖలవారీగా ఉన్నత స్థాయి అధికారులతో సమీక్షలు, అధికారుల బదిలీలు, నియామకాలు, అసెంబ్లీ సమావేశాలు.. ఇలా రోజూ బిజీబిజీగా గడుపుతున్నారు. గత ప్రభుత్వ వైఫల్యాలను సరిచేసే దిశగా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు.
ఇంతటి బిజీ షెడ్యూల్ లో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ క్రమంలో 5వ తరగతి చదువుతున్న ఓ బాలిక ఆయనకు లేఖ రాసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే…




