భారత్ సమాచార్, రాజకీయం : కొత్త రేషన్ కార్డులకు కోసం ఎదురుచూస్తున్న లక్షలాది కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కొత్త కార్డుల జారీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. వీటి కోసం ఈ నెల 28 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. మీసేవ ద్వారా ఆన్ లైన్ లో ఈ దరఖాస్తులు తీసుకోనున్నారు. అర్హుల ఎంపికను క్షేత్రస్థాయిలోనే చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వీటి పరిశీలన మొదలుపెట్టనున్నారు. అర్హుల ఎంపికను గ్రామాల్లో గ్రామసభలు.. నగరాలు, పట్టణాల్లో బస్తీసభల ద్వారా ఎంపిక…