భారత్ సమాచార్, అంతర్జాతీయం ;
ప్రముఖ పేమెంట్స్ సంస్థ గూగుల్ పే తమ సర్వీసుల్ని జూన్ 4వ తేదీ నుంచి అమెరికాలో నిలిపి వేయనున్నట్టు సంస్థ తాజాగా ప్రకటించింది. ప్రస్తుతానికి గూగుల్ పే యాప్ భారత్, సింగపూర్‌లో మాత్రమే పని చేయనుందని తెలిపింది. కంపెనీ ప్రకటించిన నిబంధనల ప్రకారం వినియోగదారులందరూ గూగుల్ వాలెట్‌కి బదిలీ చేయబడతారని వెల్లడించింది. అందువల్ల ఇకమీదట గూగుల్ పే సేవలు అమెరికాలో బంద్ కానున్నాయి.
గూగుల్ వాలెట్‌ను ప్రమోట్ చేసేందుకే కంపెనీ ఇలాంటి చర్య తీసుకుందని టెకీలు భావిస్తున్నారు. మరికొందరు…



