భారత్ సమాచార్, అమరావతి ; గత నెల మొదటి వారం అంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలన్నీ కూడా పెన్షన్ల పంపిణీ చుట్టూనే తిరిగాయి. అధికార పక్షం, ప్రతి పక్షం, ఎన్నికల కమిషన్, రాష్ట్ర హైకోర్టు జోక్యంతో మొత్తం అంతా గందరగోళం అయిపోయింది. మళ్లీ మే నెల మొదటి వారం రావటంతో ఏపీ రాజకీయాలు పెన్షన్ల చుట్టూ తిరగటం మొదలైంది. అయితే ఈ సారి ఎటువంటి గందరగోళానికి తావు లేకుండా ఏపీ ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నాయి. రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం…