భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తూప్రాన్ పరిసర ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ ఇక్కడ నూతన కోర్టు ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ప్రతిపాదిత కోర్టు భవనంగా గుర్తించిన పాత ఎంపీడీవో కార్యాలయ భవనాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ, అదనపు జిల్లా న్యాయమూర్తి సంతోష్ కుమార్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మౌలిక వసతులు, మరమ్మతుల కోసం ప్రభుత్వం ఇప్పటికే రూ. 30 లక్షలు మంజూరు చేసింది. జులై 31వ తేదీలోపు అన్ని పనులు పూర్తి చేసి భవనాన్ని అప్పగించాలని…