భారత్ సమాచార్, అంతర్జాతీయం : ఈక్వెడార్ రాజధాని గ్వయకిల్ లో సాయుధులైన కొందరు దుండగులు నిన్న టీసీ టీవీ చానల్ లైవ్ లోకి ప్రవేశించి కలకలం సృష్టించారు. మాస్క్ లు ధరించి తుపాకులు, డైనమేట్లతో వచ్చిన వీరు.. వార్తలు చదువుతున్న న్యూస్ ప్రజెంటర్ సహ అక్కడున్న సిబ్బందిని బెదిరించారు. వారిని నేలపై కూర్చోబెట్టి తలపైకి తుపాకీ పెట్టారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులు మిమ్మల్ని కాపాడలేరంటూ బెదిరించారు. ఇది లైవ్ లో ప్రత్యక్ష ప్రసారం అయ్యింది. లైవ్ లో తుపాకీ శబ్దాలు కూడా…