భారత్ సమాచార్, సినీ టాక్స్ : ‘హనుమాన్’. సంక్రాంతి బరిలో చిన్న మూవీగా వచ్చి ఏకంగా విజేతగా నిలిచింది. మహేశ్ బాబు, నాగార్జున, వెంకటేశ్ వంటి అగ్రహీరోలు పోటీలో ఉన్నా.. అన్నింటిని మించి అద్భుతమైన కలెక్షన్లతో దూసుకెళ్తోంది. మంచి కంటెంట్ ఉంటే స్టార్ హీరోలతో పనిలేదని హనుమాన్ నిరూపించింది. అప్ కమింగ్ హీరో, యువ దర్శకుడు, చిన్న నిర్మాత కలిసి చేసిన వండరే హనుమాన్ అని చెప్పక తప్పదు. కేవలం 27 కోట్లతో తీసినా ఈ మూవీ ఇప్పటికే వంద కోట్లు వసూలు చేసింది.
…


