భారత్ సమాచార్, విశాఖపట్నం ;
అల్పపీడనం ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వైజాగ్ వాతావరణశాఖ తాజాగా వెల్లడించింది. తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. రేపు, ఎల్లుండి రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. భారీ వర్షాల దృష్ట్యా రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ టోల్ ఫ్రీ…





