భారత్ సమాచార్, హైదరాబాద్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ అగ్రనేత వీహెచ్ హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం లోక్‌సభ సీటు తనకు రాకుండా అడ్డుపడుతున్నారని అన్నారు. భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారని, భట్టి ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదన్నారు. మొదట సీటు ఇస్తా అన్నారు. ఇప్పుడు నన్ను పట్టించుకోవడం లేదన్నారు. భట్టి ఈ రోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణమన్నారు. భట్టిని ఎమ్మెల్సీ చేసేంది నేను అని ఆయన స్పష్టం చేశారు.…