భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రైతు రుణమాఫి పై అంతు లేని చర్చ జరుగుతోంది. దీనికి మరికొన్ని గంటల్లో తెరపడనుంది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ సీఎం శుభవార్త తెలిపారు. తొలివిడతగా ఈ నెల 18 వ తేదీ నాటికి అర్హులైన రైతులందరికీ లక్ష రూపాయల మేరకు రుణమాఫీ కానుంది. రుణ మాఫీకి రేషన్ కార్డు నిబంధన పెట్టారన్న అంశంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు. పాస్…





