భారత్ సమాచార్, అంతర్జాతీయం ;

భారత ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను ఐక్యరాజ్య సమితి (United Nations-UNO) తాజాగా సవరించింది. దాదాపుగ అంచనాలను 7 శాతానికి పెంచింది. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినిమయం పెరగడమే అందుకు కారణమని ఐరాస ప్రతినిధలు తెలిపారు. 2024లో భారత్‌ 6.9 శాతం, 2025లో 6.6 శాతం వృద్ధిరేటును నమోదు చేస్తుందని ఐరాస తాజాగా అంచనా వేసింది. బహిర్గత డిమాండ్‌ తక్కువగా ఉంటుందని. దీనివల్ల సరకుల ఎగమతిలో వృద్ధి దెబ్బతింటుందని తెలిపింది. అదే సమయంలో ఔషధ, రసాయన ఎగుమతులు బలంగా…