భారత్ సమాచార్, క్రీడలు : ఐపీఎల్ 2024 సీజన్ మినీ వేలంపాట(ఆక్షన్)కు అంతా రెడీ అయ్యింది. అత్యధిక ధరకు అమ్ముడుపోయే ఆటగాడు ఎవరో అని క్రీడాభిమానులు అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తొలిసారిగా భారత్ వెలుపల ఈ వేలం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దుబాయ్ లోని కోకాకోలా అరెనా వేదికగా ఈ ఆక్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు. భారత కాలమానం ప్రకారం.. నేటి మధ్యాహ్నం ఒంటి గంటకు వేలం పాటను ప్రారంభించనున్నారు. మొత్తం 1166 మంది ప్లేయర్లు ఈ వేలంలో పాల్గొనేందుకు ఆసక్తి కనబరిచారు. పది ఫ్రాంచైజీలు…