భారత్ సమాచార్, ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోస్ట్‌కు ముప్పు పొంచి ఉంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలవడం, విచారణ జరిగిన సంగతి తెలిసిందే. జైలులో ఉండి పాలించే విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ముందుకు మరో పిటిషన్ వచ్చింది. హైకోర్టులో హిందూసేన పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ను సీఎం పోస్ట్ నుంచి తక్షణమే తప్పించాలని అందులో కోరింది. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌