భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
1. దాక్షారామము
పంచరామాల్లో మొదటిదైన దాక్షారామము తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో ఉంది. ఇక్కడ స్వామిని “భీమేశ్వరుడు” అని పిలుస్తారు. స్వామి లింగాకారం 60 అడుగులు ఎత్తులో ఉంటుంది. పై అంతస్తు నుండి పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి లింగాకారం సగం భాగం తెలుపు మరియు సగభాగం నలుపుతో ఉంటుంది.ఇక్కడ దక్షప్రజాపతి యజ్ఞం నిర్వహించాడు. కనుక ఈ ప్రాంతానికి దాక్షారామము అని పేరు వచ్చిందంటారు.
2. అమరారామము
పంచారామల్లో రెండవదైన ‘అమరారామము’, గుంటూరు జిల్లాలోని అమరావతిలో…





