భారత్ సమాచార్, సినీ టాక్స్ : ప్రామిసింగ్ స్టార్ మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ భక్త కన్నప్ప అడ్వెంచరస్ జర్నీ నేడు న్యూజిలాండ్‌లో ఘనంగా ప్రారంభమైంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్ సిరీస్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నాడు. మంచు విష్ణు ఈ సినిమాను భారీ ఎత్తున అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో కన్నప్ప సినిమాను ప్రేక్షకుల ముందు ఉంచటానికి సినీ యూనిట్ అహర్నిశలు శ్రమిస్తోందని నిర్మాత వెల్లడించారు. తాజాగా ఈ మూవీ గురించి మంచు విష్ణు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
అతిథి పాత్రలో డార్లింగ్ ప్రభాస్
ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్ కూడా ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి మాధవ్, తోట ప్రసాద్ ఈ చిత్రానికి రచయితలు. ఈ సినిమా షూట్‌కు సంబంధించిన ప్రకటనను మంచు విష్ణు అధికారికంగా ట్వీట్ చేశాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను తెరకెక్కించే క్రమంలో తోడ్పడుతున్న ప్రతీ ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు చెప్పుకొస్తున్నారు. ‘న్యూజిలాండ్‌లోని అద్భతమైన లోకేషన్లలో కన్నప్ప షూటింగ్‌ను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. ఆ శివ పార్వతుల ఆశీస్సులతోనే ఏడేళ్ల నా శ్రమ, కల నిజం కాబోతోందన్నారు. ఈ సినిమా కోసం గత ఎనిమిది నెలలుగా టీం అంతా కూడా నిద్రలేని రాత్రులు గడిపిందని తెలిపారు. పండుగలు, పబ్బాలు కూడా మరిచిపోయి పని చేశామని వెల్లడించారు. కనీసం రోజుకు ఐదు గంటల నిద్ర కూడా ఉండేది కాదన్నారు. ఎంత కష్టంగా అనిపించినా కూడా ఏ ఒక్కరూ అలిసిపోకుండా సినిమా మీద ఇష్టంతో పని చేస్తున్నారన్నారు.



