భారత్ సమాచార్.నెట్, సూర్యాపేట జిల్లా: నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజానికి దిశానిర్దేశం చేసిన వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు.…
వీరబ్రహ్మేంద్ర స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి


