భారత్ సమాచార్, హైదరాబాద్: Mothers Day celebrations
చిక్కడపల్లిలోని ప్రముఖ ‘క్రియేటివ్ మైండ్స్ స్కూల్’ ప్రాంగణంలో ‘మదర్స్ డే’ వేడుకలను ఆదివారం (మే 10)న ఘనంగా నిర్వహించారు. పిల్లలు, తల్లుల కలయికతో స్కూల్ అంతా పండుగ వాతావరణం సంతరించుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాఠశాల ప్రిన్సిపల్ హేమ శృతి ‘మదర్స్ డే’ వేడుకలను ప్రారంభించారు.




ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రతి బిడ్డ జీవితంలో అమ్మే తొలి గురువు, తొలి స్నేహితురాలు. నిస్వార్థమైన ప్రేమకు మారుపేరు అమ్మ. సమాజంలో తల్లి పాత్ర…





