భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆదర్శవంతమైన సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని నెల్లికుదురు జీజేసీ ప్రిన్సిపాల్ కె. వీరస్వామి అన్నారు. మండల కేంద్రంలోని జీజేసీలో ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం గురుపూజోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ వీరస్వామి మాట్లాడుతూ విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత గొప్పదని పేర్కొన్నారు.

విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడం మాత్రమే కాకుండా, క్రమశిక్షణ, నైతిక విలువలు, సామాజిక బాధ్యత, దేశభక్తి వంటి…