భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: విద్యుత్ కోతలను వెంటనే ఎత్తివేసి ప్రజలకు, రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లికుదురు మండల కేంద్రంలోని విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనపై శనివారం నెల్లికుదురులో నిర్వహించిన సమరభేరి సభలో మాజీ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై మాట్లాడుతున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొంతసేపు నిరీక్షించినా విద్యుత్ పునరుద్ధరణ కాకపోవడంతో సభను ముగించారు.
అనంతరం మాజీ ఎమ్మెల్యే శంకర్…





