భారత్ సమాచార్, హైదరాబాద్
తెల్ల రేషన్ కార్డుతో సంబంధం లేకుండా ఇక నుంచి ఆరోగ్య శ్రీ సేవలను అందరికి అందుబాటులోకి తీసుకు వస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులను వేర్వేరుగా ఇస్తున్నట్లు చెప్పా రు. అర్హత గల లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి ఈ విషయాలను ప్రస్తావించారు. అందుకు సంబంధించిన విధివిధానాలను త్వరలో రూపొందించి ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేళ్ల…





