భారత్ సమాచార్, తిరుపతి ;

సనాతన ధర్మాన్ని మట్టిలో కలిపేస్తామన్న వారితో గొడవ పెట్టుకోవడానికే ప్రపంచ ప్రసిద్ధి పుణ్యక్షేత్రం తిరుపతికి వచ్చానని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ అన్నారు. ఇతర మతాలను గౌరవించేది సనాతన ధర్మమని వివరించారు.. ”ఏడుకొండల వారికి అపచారం జరిగితే మాట్లాడకుండా ఎలా ఉంటాం. అన్నీ ఓట్ల కోసమే చేస్తామా? ఓట్ల కోసమే మాట్లాడతామా? నా జీవితంలో ఇలా మాట్లాడే రోజు వస్తుందని ఊహించలేదు. నాకు అన్యాయం జరిగితే బయటకు రాలేదు. తిరుమలలో అపచారం జరుగుతోంది.. సరిదిద్దండి అని గతంలో చెప్పా.…