భారత్ సమాచార్, పిఠాపురం ;

పిఠాపురం ప్రజలు ఇచ్చిన గెలుపు గ్యారెంటీతోనే రాష్ట్రం మొత్తం కూటమి తరఫున తిరిగి ప్రచారం చేయగలిగానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గొల్లప్రోలులో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు.పిఠాపురం ఇచ్చిన గొప్ప దైర్యానికి నేను ఎన్నిసార్లు శిరస్సు వంచి నమస్కరించినా సరిపోదన్నారు. పిఠాపురంలో త్వరలో స్థలం తీసుకుని ఇల్లు కడతానని తెలిపారు. ‘‘మొన్నటి ఎన్నికల ఫలితాలు వస్తున్న సమయంలో ఏం చేస్తున్నావని చాలా మంది…