భారత్ సమాాచార్, సినీ టాక్స్ : ఎన్టీఆర్, బన్నీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఇద్దరూ బావ..బావ అని పిలుచుకుంటారు. అయితే వీరిద్దరికి తమ సినిమాల రిలీజ్ డేట్ల సమస్య వచ్చింది. మరి ఇద్దరిలో ఎవరు తగ్గుతారో చూడాలి. అయితే ‘దేవర’ సినిమాను ప్రారంభించే టైంలోనే ఆ మూవీ యూనిట్ ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తామని ప్రకటించింది. ఆ టార్గెట్ తోనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా చాలా వరకు షూటింగ్ పూర్తయ్యింది. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ మూవీ వాయిదా పడుతోందంటూ వార్తలు వస్తున్నాయి.
…


