భారత్ సమాచార్, జాతీయం : రాములోరి ప్రాణప్రతిష్ఠకు మరో రెండు రోజులే ఉండడంతో ప్రతీ ఊరూ, వాడ అంతా రామమయం అయిపోతున్నాయి. పత్రికలు, టీవీలు, సోషల్ మీడియాల్లో ఎక్కడ చూసినా రామాలయ విశేషాలు, కథనాలే వినపడుతున్నాయి. ప్రాణప్రతిష్ఠ రోజు అది చేయాలి .. ఇది చేయాలి అంటూ కొందరు మెసేజ్ లు పెడుతున్నారు. ఇప్పటికే పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, భజనలు, ర్యాలీలు తీస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే జనవరి 22న సెలవు ప్రకటించాయి. మొత్తానికి ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమంగా నిర్వహించాలని…