భారత్ సమాచార్, సినిమా డెస్క్: బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర ట్రైలర్ జూలై 30న విడుదల కాగా, అప్పటి నుంచి సినిమాలోని నటీనటుల లుక్స్, కాస్ట్యూమ్స్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి, కైకేయి పాత్రలో కనిపిస్తున్న లారా దత్తా లుక్స్‌పై కొందరు విమర్శలు చేస్తుండగా, మరికొందరు టీవీ సీరియల్స్‌తో పోలుస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ షేర్…