భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి షురువయ్యాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కూడా అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క 42 పేజీల శ్వేత పత్రాన్ని విడుదల చేసి శాసనసభ్యులకు అందించారు.
‘‘ప్రజలంతా అభివృద్ధి చెందాలని పోరాడి, ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను సాధించుకున్నాం.. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను సక్రమంగా ఉపయోగించలేదు. రోజువారీ ఖర్చులకూ కూడా ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితిని క్రియేట్ చేసింది. ఇలాంటి…





