భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి ప్రధాన కారణం నిరుద్యోగులు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో నిరుద్యోగులను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, లీకేజీలు, పరీక్షల రద్దు, ఫలితాల ప్రకటనలో ఆలస్యం.. వంటి సమస్యలతో నిరుద్యోగులు నైరాశ్యంలోకి వెళ్లారు. తమ భవిష్యత్ తో ఆడుకున్నా బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్ లేకుండా చేయాలని నిరుద్యోగులంతా గంపగుత్తగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపి అధికారంలోకి తీసుకొచ్చాయి. అయితే ప్రమాణ స్వీకారం రోజే నిరుద్యోగులకు తీపి కబురు అందిస్తారని భావించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాక ఏ చర్యలు తీసుకోకపోవడంతో…